Skip to main content

Namaste NRI

మధ్య తరగతి ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్‌లో మూవీ.. ఆది చేతుల మీదుగా ఈ.ఎం.ఐ చిత్రం

నూతన నటీనటులను పరిచయం చేస్తూ 7పి.ఎం.ప్రొడక్షన్స్‌ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ.ఎం.ఐ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిఖిల్‌ కువ్వరపు దర్శకత్వం. ఈ చిత్రం ద్వారా దరహాస్‌ హీరోగా పరిచయమవుతున్నాడు. శైలజ కథానాయికగా నటిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి ఆదిసాయికుమార్‌ క్లాప్‌నివ్వగా, సాయిమార్తాండ్‌ కెమెరా స్విఛాన్‌ చేశారు.

ప్రతి మధ్య తరగతి కుటుంబంలోని ఇ.ఎం.ఐ చెల్లింపుల కష్టాలను ఆవిష్కరిస్తూ వినోదప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఫహాద్‌ అబ్దుల్‌ మజీద్‌, సంగీతం: మాధవ్‌ప్రసాద్‌, నిర్మాతలు: సందీప్‌ ఆగరం, అష్మిత రెడ్డి బాసాని, రచన-దర్శకత్వం: నిఖిల్‌ కువ్వరపు.

Social Share Spread Message

Latest News