రవితేజ హీరోగా శివ నిర్వాణ రూపొందించిన చిత్రం ఇరుముడి. బాక్సాఫీస్ వద్ద 200కోట్ల పైగా వసూళ్లతో దూసుకుపోతున్నది.ఈ సందర్భంగా నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ మీడియాతో మాట్లాడారు. మా బ్యానర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి. కానీ ఇరుముడి ఓ మిరాకిల్. నెక్ట్స్‌లెవల్ సక్సెస్. ఇలాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల దాకా మూడు జనరేషన్స్ చూసిన సినిమా ఇది కాబట్టి ఈ ఈవెంట్‌కు జనరేషనల్ బ్లాక్‌బస్టర్ అని పేరు పెట్టాం అన్నారు.

ఈ సినిమా ఫుట్‌ఫాల్స్ సెన్సేషనల్‌గా ఉన్నాయని, ఒక్క తెలంగాణలోనే 42లక్షల మంది సినిమాను వీక్షించారని నిర్మాతలు ఆనందం వ్యక్తం చేశారు. రెండుమూడు వారాలు ఆడితే ఎక్కువ అనుకునే ట్రెండ్‌ను ఈ సినిమా మార్చివేసిందని, రోజురోజుకి సినిమాకు ఆదరణ పెరుగుతున్నదని, త్వరలో విజయోత్సవ వేడుకను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నామని నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ పేర్కొన్నారు. తెలుగు రాష్ర్టాల్లోని ప్రజలు ఈ సినిమా చూసి ఇది మన కథ, మన ఇంట్లో ఆడపిల్ల కథ అనుకుంటున్నారని, కథలోని సహజత్వం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నదని దర్శకుడు శివ నిర్వాణ తెలిపారు. అందరి సపోర్ట్ వల్లే తాను ఈ సినిమాలో అద్భుతంగా పర్‌ఫార్మ్ చేయగలిగానని బేబీ నక్షత్ర ఆనందం వ్యక్తం చేసింది.














