నూతన నటీనటులను పరిచయం చేస్తూ 7పి.ఎం.ప్రొడక్షన్స్ సంస్థ తెరకెక్కిస్తున్న ఈ.ఎం.ఐ చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. నిఖిల్ కువ్వరపు దర్శకత్వం. ఈ చిత్రం ద్వారా దరహాస్ హీరోగా పరిచయమవుతున్నాడు. శైలజ కథానాయికగా నటిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి ఆదిసాయికుమార్ క్లాప్‌నివ్వగా, సాయిమార్తాండ్ కెమెరా స్విఛాన్ చేశారు.

ప్రతి మధ్య తరగతి కుటుంబంలోని ఇ.ఎం.ఐ చెల్లింపుల కష్టాలను ఆవిష్కరిస్తూ వినోదప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: ఫహాద్ అబ్దుల్ మజీద్, సంగీతం: మాధవ్ప్రసాద్, నిర్మాతలు: సందీప్ ఆగరం, అష్మిత రెడ్డి బాసాని, రచన-దర్శకత్వం: నిఖిల్ కువ్వరపు.














