Skip to main content

Namaste NRI

లాజిక్కులు వదిలేసి మ్యాజిక్‌ని ఎంజాయ్ చేయండి : అల్లరి నరేష్‌

అల్లరి నరేష్‌ హీరోగా చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ తెరకెక్కించిన ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌ రంభ ఊర్వశి మేనక ప్రేక్షకుల ముందుకొచ్చింది.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సక్సెస్‌మీట్‌లో అల్లరి నరేష్‌ మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత నేను చేసిన కామెడీ సినిమా ఇది. ప్రేక్షకుల ఆదరణ ఎలా ఉంటుందోనని చిన్న భయం ఉండేది. ఇప్పుడు వారి స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది. బీ.సీ. సెంటర్లలో అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తున్నది. వారాంతంలో ఏ సెంటర్స్‌లో కూడా పికప్‌ అవుతుందని భావిస్తున్నాం అన్నారు. సినిమాకు మంచి టాక్‌ వస్తున్నదని, కథలో లాజిక్కులు వదిలేసి, మ్యాజిక్‌ను ఎంజాయ్‌ చేయాలని ఆయన అన్నారు.

భూలోకం-యమలోకం అనే ఫార్ములా తెలుగు సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌ అని ఈ సినిమా మరోసారి నిరూపించిందని నిర్మాత రాజేష్‌ దండా ఆనందం వ్యక్తం చేశారు. చందమామలాంటి కథ ఇదని, ఆద్యంతం నవ్విస్తుందని దర్శకుడు చంద్రమోహన్‌ చింతాడ చెప్పారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News