Skip to main content

Namaste NRI

తానా ప్రపంచ సాహిత్య వేదిక 95వ సమావేశం

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం ఆధ్వర్యంలో గత ఆరు సంవత్సరాలుగా నెల నెలా తెలుగు వెలుగు పేరిట ప్రతి నెలా ఆఖరి ఆదివారం ఆన్‌లైన్ వేదికగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు రాష్ట్ర భాషా దినోత్సవం దినోత్సవం నిర్వహించారు. తానా ప్రపంచసాహిత్యవేదిక తెలుగే మన వెలుగు అనే అంశంపై 95వ అంతర్జాల సమావేశం నిర్వహించింది. సమావేశం సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ స్వాగతోపన్యాసంతో కార్యక్రమం ప్రారంభంమై ఉల్లాసంగా జరిగింది.

ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణంరాజు మాట్లాడుతూ తెలుగు భాష పరిరక్షణ, పరివ్యాప్తికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. త్వరలోనే ఒక సలహా కమిటీని ఏర్పాటు చేసి తెలుగు భాషాభివృద్ధికి చేపట్టవలసిన చర్యల గురించి చర్చించి తగు విధివిధానాలను రూపొందిస్తామని అన్నారు. ఉండి ప్రాంతంలో తిరుపతిశాస్త్రి విగ్రహం, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొత్తగా కడుతున్న ఒక బ్రిడ్జికి ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త డా. ఎల్లాప్రగడ సుబ్బారావు బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామన్నారు.

తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ఆంగ్ల భాషా ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుంటూనే తెలుగుభాషను నిలబెట్టుకోవడంలో తల్లిదండ్రుల బాధ్యత గురుతరమైనదని అన్నారు. ప్రభుత్వం అన్ని శాఖలలోను తెలుగుభాషను వాడాలని, పరిపాలనా భాషగా తెలుగు ఉండాలని సూచించారు. ఆంగ్లంలో వచ్చిన ప్రభుత్వ ఉత్తర్వులన్నీ వెంటనే తెలుగులో అనువాదం అయ్యేటట్లు చూడాలని చెప్పారు. కనీసం ఐదవ తరగతి వరకూ మాతృబాషలో విద్యాభోదన జరగవలసిన అవసరం ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ఆచార్య డాక్టర్ శలాక రఘునాథ శర్మ, రేగుళ్ళ మల్లికార్జునరావు, గిడుగు రామమÖర్తి ముని మనుమరాలు గిడుగు లక్ష్మీ కాంతికృష్ణ, డాక్టర్ మాడభూషిత్ సంపత్
కుమార్, డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ ప్రసంగించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events