Skip to main content

Namaste NRI

రంభ ఊర్వశి మేనక పై ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం: అల్లరి నరేష్

అల్లరి నరేష్‌ కథానాయకుడిగా, చంద్రమోహన్‌ చింతాడ దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ కామెడీ ఎంటర్‌టైనర్‌ రంభ ఊర్వశి మేనక చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు.ఈ సందర్భంగా అల్లరి నరేష్‌ మాట్లాడుతూ ఇది అందరిని నవ్వించే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. నేను చిన్నప్పటి నుంచి నాగార్జునగారి అభిమానిని. ఆయనతో కలిసి నా సామిరంగా చిత్రంలో నటించాను. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్‌లో హీరోగా చేయడం ఆనందంగా ఉంది అన్నారు.

థియేటర్‌ నుంచి ప్రేక్షకులు నవ్వుకుంటూ బయటికొస్తారని, వందశాతం వినోదాన్ని పంచే సినిమా ఇదని చిత్ర నిర్మాతలు రాజేష్‌ దండా, నిమ్మకాయల ప్రసాద్‌ తెలిపారు. తన తొలి చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్‌, హాస్య మూవీస్‌ బ్యానర్‌లో చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు చంద్రమోహన్‌ చింతాడ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయికలు ప్రిషా సింగ్‌, రాశిసింగ్‌, విష్ణుప్రియతో పాటు యూనిట్‌ సభ్యులందరూ పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events