Skip to main content

Namaste NRI

కళ్యాణం కమనీయం జీవితం సినిమా ట్రైలర్ లాంఛ్

ఖాన్‌ దురాని, సాహితి ఆవంచ జంటగా నటిస్తున్న చిత్రం కల్యాణం కమనీయం జీవితం. రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్‌రావు, కిషోర్‌ గుండాల నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

యువతతో పాటు ఫ్యామిలీస్‌ అందరూ మెచ్చేలా చక్కటి హాస్యం, భావోద్వేగాల కలబోతగా ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు తెలిపారు. ఈ కథలో థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ కూడా ఉంటాయని, కొత్తవాళ్లను ప్రోత్సహిస్తూ ఇన్నోవేటివ్‌ కంటెంట్‌తో సినిమాలు తీయాలనే లక్ష్యంతో తమ సంస్థను స్థాపించామని నిర్మాతలు పైలా ప్రసాద్‌ రావు, కిషోర్‌ గుండాల చెప్పారు. ప్రేమికుల కోణంలో గొప్ప పాయింట్‌ను చర్చించిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని హీరో ఖాన్‌ దురాని అన్నారు.ఈ నెల 18న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News