Skip to main content

Namaste NRI

నాగచైతన్య వృషకర్మ విడుదల తేదీ ఖరారు.. థియేటర్లలోకి వచ్చేది ఎప్పుడంటే?

నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న మిథికల్‌ థ్రిల్లర్‌ వృషకర్మ. కార్తీక్‌ దండు దర్శకుడు. బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌, సుకుమార్‌ నిర్మాతలు. మైథాలజీ, మిస్టరీ, థ్రిల్లర్‌ అంశాల కలబోతగా భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ చిత్రంలో నాగచైతన్య ట్రెజర్‌ హంటర్‌గా పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన మేకోవర్‌ సరికొత్తగా ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం షూటింగ్‌ చివరి దశలో ఉందని, అత్యుత్తమ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని మేకర్స్‌ తెలిపారు. మీనాక్షి చౌదరి, స్పర్ష్‌ శ్రీవాస్తవ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ బి లోక్‌నాథ్‌, దర్శకత్వం: కార్తీక్‌ దండు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events