Skip to main content

Namaste NRI

జి.వి.ప్రకాష్ కుమార్ ఆవిష్కరించిన చకోర లోని ధమ్ ధమ్ సాంగ్

శ్రవణ్‌, మలైకా టి వాసుపల్‌ జంటగా నటిస్తున్న చిత్రం చకోర – లూనార్‌ లవ్‌ బర్డ్‌. మంగా శ్రీనివాస్‌ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్‌ 8న సినిమా థియేట్రికల్‌ రిలీజ్‌ కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి రెండవ పాటకు చెందిన లిరికల్‌ వీడియోను స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌, హీరో జీవీ ప్రకాశ్‌కుమార్‌ ఆవిష్కరించి చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ధమ్‌ ధమ్‌ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రాయగా, ప్రిన్స్‌ హెన్రీ స్వరపరిచారు. నూతన గాయని అభిఖ్య తనికెళ్ల ఆలపించారు. మాస్టర్‌ మెహర్‌ బాబా కొరియోగ్రఫీ అందించిన ఈ పాట యువతని ఉర్రూతలూగిస్తుందని మేకర్స్‌ అంటున్నారు. సుమన్‌, ఇంద్రజ, అనుష్క లూహార్‌, యామిని, ఎల్బీ శ్రీరామ్‌, బ్రహ్మాజీ, మణిచందన, ప్రభావతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: రుప్ప గోపీకృష్ణ, నిర్మాణం: హై జోయ్‌ కమర్షియల్స్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events