ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అప్పలాచియన్ రీజియన్ ఆధ్వర్యంలో మహిళల ఆరోగ్యం, ఉత్సాహాన్ని పెంపొందించేందుకు ప్రత్యేకంగా ‘దేశీ డాన్స్ వర్కవుట్’ జుంబా కార్యక్రమాన్ని నిర్వహించారు. సెప్టెంబర్ 12, నార్త్ కరోలినాలోని హంటర్స్విల్లే వెటరన్స్ పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమానికి దాదాపు 250మందికిపైగా మహిళలు హాజరయ్యారు.


ప్రముఖ జుంబా ఇన్స్ట్రక్టర్ మౌనిక కావలి వచ్చినవారికి శిక్షణ ఇచ్చారు. కార్యక్రమానికి సౌమ్యశ్రీ తలంకి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. హాజరైన మహిళలందరికీ ‘అమోఘం ఇండియన్ రెస్టారెంట్’ వారి సౌజన్యంతో ఉచిత అల్పాహారం అందించారు. తానా హెల్త్ సర్వీసెస్ కో ఆర్డినేటర్ మాధురి ఏలూరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది,ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరినీ తానా అధ్యక్షుడు డా. నరేన్ కొడాలి, ఈవిపి శ్రీనివాస్ లావు అభినందించారు. తానా అప్పలాచియన్ రీజినల్ రిప్రజెంటేటివ్ రవి (నాని) వడ్లమూడి, స్పెషల్ ప్రాజెక్ట్స్ కోఆర్డినేటర్ నాగ పంచుమర్తి, టీమ్ స్క్వేర్ చైర్ కిరణ్ కొత్తపల్లి, ఫౌండేషన్ ట్రస్టీ ఠాగూర్ మల్లినేని తో పాటు జ్యోత్స్న గంటా, పద్మజ కొమ్మినేని తదితరులు ఈ కార్యక్రమం విజయవంతానికి కృషి చేశారు.




















