
18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శనివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద ఆయనకు స్వాగతం పలికారు. పొరుగున ఉన్నవారితో స్నేహంగా ఉండటం, దీర్ఘకాల మైత్రిపై దృష్టిసారించడం వంటి అంశాలను అందులో ప్రస్తావించింది. ఇరు దేశాల నాయకుల వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో భారత్తో కలిసి పనిచేయడానికి చైనా సిద్ధంగా ఉంది. పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు విభేదాలను పరిష్కరించుకోవడానికి మేం కృషి చేస్తున్నాం అని భారత్లోని చైనా రాయబారి గ్జు ఫీహాంగ్ తెలిపారు.















