Skip to main content

Namaste NRI

ప్రపంచానికి మరో షాక్‌

ప్రపంచానికి మరో చమురు షాక్‌ పొంచి ఉంది. ఇప్పటికే అమెరికా-ఇరాన్‌ యుద్ధం కారణంగా హొర్ముజ్‌ జలసంధిలో ఎగుమతులు, దిగుమతులు నిలిచిపోవడంతో అంతర్జాతీయ విపణిలో బ్యారెల్‌ చమురు ధర 100 డాలర్లు దాటింది. గ్యాస్‌, పలు నిత్యావసరాల రవాణాకు ఆటంకం ఏర్పడింది. తాజాగా, ప్రపంచంలోని 12 శాతం సరుకు రవాణా జరిగే బాబ్‌ ఎల్‌ మాండెబ్‌ జలసంధిలో జరిగే ఎగుమతి, దిగుమతులు కూడా ప్రమాదంలో పడే అవకాశం ఏర్పడింది. ఈ జలసంధిపై హౌతీలు నెమ్మనెమ్మదిగా పట్టుసాధిస్తూ అగ్రరాజ్యం అమెరికా సహా, ప్రపంచ దేశాలను సైతం భయపెట్టే పరిస్థితిని తెస్తున్నారు. యెమెన్‌-జిబేతీల మధ్య ఎర్రసముద్ర ముఖద్వారం వద్ద ఉన్న ఈ ఇరుకైన జలమార్గం పశ్చిమాసియాలోని గణనీయమైన చమురు రవాణాకు ఒక సురక్షిత మార్గంగా ఉండేది.

అయితే ఆ పరిస్థితి బలహీనపడుతున్నట్టు కన్పిస్తున్నది. ఇరాన్‌ మద్దతు కలిగిన యెమెన్‌ హౌతీ తిరుగుబాటుదారులు గత కొన్ని వారాలుగా బాబ్‌ అల్‌-మాండెబ్‌ జలసంధి గుండా సాగే నౌకాయానానికి ముప్పు కలిగిస్తున్నారు. గత 48 గంటల్లో వారు ఈ నౌకాయాన మార్గంపై గణనీయంగా పట్టుబిగించారు. వారు గురువారం మోచారేవు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ కీలకమైన సముద్ర మార్గ మధ్యలో ఉన్న వ్యూహాత్మక పెరిమ్‌ ద్వీపాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కాగా, అమెరికా మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్‌తో యుద్ధం ముగుస్తుందని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events