ఇరాన్ యుధ్దం కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న సౌదీ అరేబియాకు భారీ జాక్పాట్ తగిలింది. సౌదీ అరేబియాలో 110 టన్నుల ముడి యురేనియం నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. మెదీనా ప్రాంతంలో యురేనియం సహా పలు అరుదైన ఖనిజాలు బయటపడ్డట్లు సౌదీ అరేబియాకు చెందిన ఎనర్జీ మినిస్టర్ ప్రిన్స్ అబ్దులాజిజ్ బిన్ సల్మాన్ అన్నారు.

మెదీనా ప్రాంతంలోని జబల్ సయిద్ ప్రాజెక్టు వద్ద అధ్యయనం చేస్తుండగా 110 టన్నుల అరుదైన ఖనిజాలు, యురేనియం నిల్వలు లభ్యమైనట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్ యుద్ధం కారణంగా ప్రస్తుతం సౌదీ చాలా ఇబ్బందులు పడుతోంది. ముఖ్యంగా ఇరాన్ మద్దతుదారులైన హౌతీ ఉగ్రవాదులు సౌదీ అరేబియాపై దాడులకు దిగుతోంది. దీనివల్ల అక్కడి చమురు క్షేత్రాలు దెబ్బతింటున్నాయి. పోర్టులపై, చమురు నౌకలపై దాడి జరుగుతోంది. దీనివల్ల సౌదీ తీవ్రంగా నష్టపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో యురేనియం నిల్వలు బయటపడటం ఆ దేశానికి భారీ ఊరటనిచ్చేదే.















