Skip to main content

Namaste NRI

ధ్రువ్ విక్రమ్ కొత్త సినిమా జాకీ.. అదరగొట్టే ఫస్ట్ లుక్‌!

ప్రతిష్టాత్మక మైత్రీమూవీమేకర్స్‌ తమిళంలో తమ నాలుగో చిత్రాన్ని ప్రకటించింది. సినిమా పేరు జాకీ. నో రీటేక్స్‌ అలౌడ్‌ అనేది ఉపశీర్షిక. తమిళ యువహీరో ధృవ్‌ విక్రమ్‌ ఇందులో కథానాయకుడు. కరణ్‌ అరవింద్‌ కుమార్‌ దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. పక్కా మాస్‌గా, లార్జర్‌ దేన్‌ లైఫ్‌ అవతార్‌లో ఉన్న ధృవ్‌ విక్రమ్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు.

ధృవ్‌ ఒరిజినల్‌ లుక్‌కి ైస్టెలిష్‌ కామిక్‌ బుక్‌ తరహా విజువల్‌ని జత చేసి వినూత్నంగా ఈ పోస్టర్‌ని డిజైన్‌ చేశారు. ైస్టెలిష్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ధృవ్‌ పాత్ర క్యూరియాసిటీ క్రియేట్‌ చేస్తుందని, ఓ కొత్త తరహా కమర్షియల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: వికీ, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events