Skip to main content

Namaste NRI

తొలిసారి అమెరికా బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌ .. అంత‌రిక్షంలో!

అంతరిక్షంలో తమ వద్ద ఆయుధాలు ఉన్నాయని అమెరికా తొలిసారి బహిరంగంగా ప్రకటించింది. ఇప్పటికే కొన్ని స్పేస్‌ కంట్రోల్‌ వెపన్స్‌ కక్ష్యలో ఉన్నాయని అమెరికా స్పేస్‌ ఫోర్స్‌ వెల్లడించింది. శత్రు దేశాల దాడుల నుంచి అమెరికా, మిత్రదేశాల బలగాలను రక్షించేందుకే వీటిని మోహరించినట్లు తెలిపింది. అయితే ఆయుధాల సంఖ్య, వాటి స్థానం, ఏ తరహా వ్యవస్థలను ఉపయోగిస్తున్నారన్న వివరాలను మాత్రం బ‌య‌ట‌పెట్ట‌లేదు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌ కార్యదర్శి ట్రాయ్‌ మెయింక్‌ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించారు.

అమెరికా సాయుధ బలగాలపై శత్రు దేశాల నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనే సామర్థ్యాలను మరింత పెంచుతున్నామని చెప్పారు. ప్రస్తుతం కక్ష్యలోనే శత్రు చర్యలను ఎదుర్కోగల అంతరిక్ష ఆయుధాలు ఉన్నాయని స్పష్టంచేశారు. ఈ ఆయుధాలు కైనెటిక్‌, నాన్‌-కైనెటిక్‌ విధానాల్లో పనిచేయగలవని స్పేస్‌ ఫోర్స్‌ తెలిపింది. అవసరాన్ని బట్టి రక్షణతోపాటు దాడి చర్యల్లోనూ వీటిని ఉపయోగించవచ్చని పేర్కొన్న‌ది.అయితే అవి ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఆయుధాలా, ఇతర రకాల వ్యవస్థలా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు.

అంతరిక్ష రంగంలో చైనా, రష్యాల నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా భావిస్తోంది. ఉపగ్రహాలు సైనిక కమ్యూనికేషన్లు, నిఘా, నావిగేషన్‌కు కీలకం కావడంతో వాటిపై ఆధిపత్యం భవిష్యత్‌ యుద్ధాల్లో కీలకంగా మారనుంది. ఈ నేపథ్యంలో అమెరికా తొలిసారి కక్ష్యలో ఆయుధాల ఉనికిని బహిరంగంగా అంగీకరించడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1967 నాటి ఔటర్‌ స్పేస్‌ ట్రీటీ అంతరిక్షంలో సామూహిక విధ్వంసక ఆయుధాల మోహరింపును నిషేధిస్తుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events