Skip to main content

Namaste NRI

ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి : జేసన్‌ సంజయ్‌

సందీప్‌కిషన్‌ హీరోగా నటించిన తాజా చిత్రం సిగ్మా. ఈ చిత్రం ద్వారా తమిళనాడు సీఎం దళపతి విజయ్‌ తనయుడు జేసన్‌ సంజయ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మించారు. హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా సందీప్‌కిషన్‌ మాట్లాడుతూ తెలుగు హీరోగా నేను చాలా గర్వపడతాను. అలాగే తమిళ ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ, ఆదరణ చూస్తుంటే ఒక్కోసారి నాకే ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నారు.

ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయని, అడ్వెంచర్‌ ప్రధానంగా సాగే ట్రెజర్‌ హంట్‌లాంటి సినిమా ఇదని దర్శకుడు జేసన్‌ సంజయ్‌ తెలిపారు. ఈ సినిమా ద్వారా తమిళ సినీరంగంలో అరంగేట్రం చేయడం ఆనందంగా ఉందని చిత్ర కథానాయిక ఫరియా అబ్దుల్లా చెప్పింది. మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్‌లో ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉందని మైత్రీ శశిధర్‌ రెడ్డి పేర్కొన్నారు. అక్టోబర్‌ 2న ప్రేక్షకుల ముందుకురానుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events