Skip to main content

Namaste NRI

ఐసీసీపై అమెరికా ఆంక్షలు

అంతర్జాతీయ క్రిమినల్‌ న్యాయస్థానం (ఐసీసీ)పై విస్తృతమైన ఆంక్షలను విధించడానికి ట్రంప్‌ యంత్రాంగం సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీని కారణంగా ఐసీసీకి ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడమే కాక, రోజువారీ కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడుతుందని పేర్కొంది. ఒక వేళ ఆంక్షలు అమలయితే అమెరికా ట్రెజరీ లైసెన్స్‌ లేకుండా పౌరులు కానీ, సంస్థలు కానీ ఐసీసీకి నగదు, వస్తువులు పంపడంపై నిషేధం విధిస్తారు. అమెరికా ఆంక్షలు ఆరేడు నెలల గడువు తర్వాత ఐసీసీతో లావాదేవీలను అగ్రరాజ్యం నిషేధిస్తుందని తెలిపింది. ఆంక్షలకు సంబంధించిన నిర్ణయం ఈ వారం న్యూయార్క్‌లో జరగబోయే ఐరాస సాధారణ సభ సమావేశంలో కానీ, దాని తర్వాత కానీ తీసుకుంటారని రాయిటర్స్‌ సంస్థ తెలిపింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events