హార్ముజ్ జలసంధిని తెరిచే విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఈ జలసంధిలో దిగ్బంధనాన్ని అమెరికా తొలగిస్తే, అలాగే, సైనిక మోహరింపులను తగ్గిస్తే వారం రోజుల్లో జలసంధిని తెరుస్తామని ఇరాన్ ప్రకటించింది. అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమై దాదాపు ఏడు నెలలు కావస్తోంది. ఇంతకాలం హార్ముజ్ జలసంధి పూర్తిస్తాయిలో తెరుచుకోలేదు. మధ్యలో కొంతకాలం తెరుచుకున్నా ఆ వెంటనే మళ్లీ జలసంధిని ఇటు ఇరాన్, అటు అమెరికా దిగ్బంధించాయి.

దీంతో హార్ముజ్ నుంచి నౌకల రవాణా అతికష్టంగా మారింది. ప్రపంచ వాణిజ్యంలో, చమురు రవాణాలో కీలకమైన హార్ముజ్‌ను తెరవాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి. హార్ముజ్ మూసి ఉంచడం వల్ల ఇరాన్‌తోపాటు అమెరికాకు కూడా ఆర్థికంగా భారంగానే మారింది. దీంతో రెండు దేశాల మీద ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇరాన్ చేసిన ప్రకటన ఆసక్తి కలిగిస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ అమెరికాలో పర్యటించనున్నారు. న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి సమావేశానికి ఆయన హాజరుకానున్నారు.















