Skip to main content

Namaste NRI

రణబాలి నుంచి ఏందయ్యా సామీ సాంగ్ రిలీజ్

విజయ్‌ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న చిత్రం రణబాలి. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. మ్యూజికల్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి ఏందయ్యా సామీ అనే పాటను విడుదల చేశారు. నాయకానాయికల పెళ్లి నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించారు. 19వ శతాబ్దంలో పెళ్లి సందడి ఎంత శోభాయమానంగా ఉందో ఈ పాటలో ఆవిష్కరించారు.

అజయ్‌-అతుల్‌ స్వరపరచిన ఈ పాటను రామజోగయ్యశాస్త్రి రచించారు. శ్వేతామోహన్‌, అజయ్‌ గోగవలే ఆలపించారు. ఏందయ్యా సామీ..ఇట్ల గాస్తాందీ వెన్నెల, ఉపేస్తా ఉంది సిత్తరాలా ఉయ్యాలా, వీచే గాలికి అత్తరద్దిందెవ్వరూ, మారే ఝాముకి మందుపెట్టిందెవ్వరు, మాయదారి మనస్సాగక జాగరమన్నరా అంటూ అర్థవంతంగా ఈ పాట సాగింది. 19వ శతాబ్దం బ్రిటీష్‌ పాలనాకాలం నాటి యథార్ధ చారిత్రక సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దసరా కానుకగా అక్టోబర్‌ 16న ప్రేక్షకుల ముందుకురానున్న విషయం తెలిసిందే.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events