Skip to main content

Namaste NRI

కర్ణుడిగా రాఘవ లారెన్స్… మహావీర్ కర్ణ లో ఫస్ట్ లుక్ రిలీజ్

మహాభారతంలో వీరత్వం, దానగుణానికి ప్రతీక అయిన మహాయోధుడు కర్ణుడిగాథ వెండితెరపై రానుంది. మహావీర్ కర్ణ పేరుతో పాన్‌ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న ఈ చిత్రంలో కర్ణుడి పాత్రలో రాఘవ లారెన్స్‌ నటిస్తున్నారు. ఇవాళ ఆయన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. రమేష్‌వర్మ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ చిత్రాన్ని జయంతిలాల్‌ గడా సమర్పణలో ఆర్వీ స్టూడియోస్‌, శ్రీ నీలాద్రి ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్‌తో విజువల్‌ వండర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నామని, కర్ణుడి వీరోచిత పోరాటం, త్యాగాన్ని ఆవిష్కరించే చిత్రమిదని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events