హీరో రామ్‌చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. రంగస్థలం వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత రామ్‌చరణ్-సుకుమార్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ హైప్ నెలకొని ఉంది. ఈ సినిమాలో రామ్‌చరణ్ ైస్టెలిష్ లుక్స్‌లో కనిపిస్తారని, అర్బన్ నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామా ఇదని సమాచారం.ఈ సినిమా కోసం రామ్‌చరణ్ 15కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా కనిపించబోతున్నారట.

తాజా సమాచారం ప్రకారం దసరా సందర్భంగా అక్టోబర్ 20న ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలిసింది. ఆర్‌సీ17 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ తెరకెక్కించబోతున్నాయి.















