
మానస వారణాకిసి తెలుగులో భారీ ఆఫర్‌ను దక్కించుకుంది. శర్వానంద్ నటిస్తున్న యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ జార్జ్‌క్రిష్ లో ఆమెను కథానాయికగా ఖరారు చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. కథాగమనంలో మానస వారణాసి పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, శర్వానంద్‌తో ఆమె ప్రేమాయణం ఆద్యంతం ఆసక్తిగా సాగుతుందని మేకర్స్ తెలిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతున్నది. సంక్రాంతికి విడుదలకానుంది.















