Skip to main content

Namaste NRI

రామాయణం మూవీ నుంచి జై జై రామ్ సాంగ్ విడుదల

నితీశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా పౌరాణిక దృశ్యకావ్యం రామాయణం. ఇందులో సీతారాములుగా సాయిపల్లవి, రణబీర్‌కపూర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా మూడువేల కోట్ల నిర్మాణ వ్యయంతో రెండు భాగాలుగా నమిత్‌ మల్హోత్రా నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళి కానుకగా విడుదల కానున్నది. ఈ సందర్భంగా మేకర్స్‌ ఈ సినిమా సంగీత ప్రయాణాన్ని షురూ చేశారు. సినిమాలోని తొలి పాట జై జై రామ్‌ తెలుగు వెర్షన్‌ని విడుదల చేశారు.

అచ్యుతం కేశవం.. కృష్ణ దామోదరం.. రామ నారాయణం జానకీ వల్లభం అంటూ సాగే ఈ భక్తిరసాత్మక గీతాన్ని రాకేందు మౌళి రాయగా, ఏఆర్‌ రెహ్మాన్‌ స్వరపరిచారు. దీపాలి సహాయ్‌, రాఘవ్‌ కౌశిక్‌ ఆలపించారు. సినిమా నుంచి విడుదలైన ఈ తొలిపాట కథలోని ఆత్మను ప్రతిబింబిస్తుందని చిత్ర నిర్మాత నమిత్‌ మల్హోత్రా చెప్పారు. ప్రార్థనలోని స్వచ్ఛత, ఆత్మీయతకు ప్రతిరూపం ఈపాట అని ఏఆర్‌ రెహమాన్‌ అభిప్రాయపడ్డారు. భక్తుడికి రాముడితో ఉన్న అనుబంధాన్ని వ్యక్తీకరించే పాట ఇదని గీత రచయిత రాకేందు మౌళి చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events