బాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ లవ్ అండ్ వార్ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఒక్కొక్కటిగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్ తాజాగా ఆలియా భట్ ఫస్ట్ లుక్‌ను అధికారికంగా విడుదల చేసింది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

ఆగ్ భీ, దిల్ కీ జాన్ భీ!(కసిగా మంట పెట్టేలా.. గుండెల్లో ప్రేమను నింపేలా) అంటూ మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, వికీ కౌశల్ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్టార్ హీరో హీరోయిన్ల కాంబినేషన్ కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, ఈ భారీ బడ్జెట్ రొమాంటిక్ డ్రామా సినిమాను 2027 జనవరి 21న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. థియేటర్లలో కలుద్దాం అంటూ చిత్ర బృందం ఇచ్చిన అప్డేట్తో అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.















