Skip to main content

Namaste NRI

ఘోర విమాన ప్రమాదం .. 14 మంది మృతి

డెమొక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ కాంగోలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. క్వాంగో ప్రావిన్స్‌లోని కెంజ్‌ ప్రాంతంలో విమానం కుప్పకూలడంతో ఇద్దరు సీనియర్‌ సైనికాధికారులు సహా 14 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని కాంగో సైన్యం వెల్లడించింది.మృతుల్లో మిలిటరీ కోర్టు అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ ముటోంబో కటలాయి టియెండే, సాయుధ దళాల ఆడిటర్‌ జనరల్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ బకుమి లికులియా ఉన్నారని సైనిక ప్రతినిధి మేజర్‌ జనరల్‌ ఎఫోమి ఎకెంగే తెలిపారు. వారిద్దరితో పాటు మరో 12 మంది సైనిక ప్రతినిధులు, సిబ్బంది కూడా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.

విమానం నైరుతి కాంగోలోని కిక్విట్‌ నుంచి రాజధాని కిన్షాసాకు తిరిగి వెళ్తుండగా సాంకేతిక సమస్య తలెత్తినట్లు స్థానిక అధికారులు తెలిపారు. కెంజ్‌ వద్ద అత్యవసరంగా ల్యాండ్‌ అయ్యేందుకు ప్రయత్నించిన సమయంలో విమానం కుప్పకూలినట్లు సమాచారం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events