Skip to main content

Namaste NRI

విక్రమ్ ప్రభు సిటీ ఆఫ్ గోల్డ్ .. ఫస్ట్ లుక్

విక్రమ్‌ప్రభు కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం సిటీ ఆఫ్‌ గోల్డ్‌. సిద్థార్థ్‌ దర్శకుడు. రోమియో పిక్చర్స్‌ పతాకంపై రాహుల్‌ నిర్మిస్తున్నారు. శివాత్మిక రాజశేఖర్‌ కథానాయికగా నటిస్తున్నది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఇందులో విక్రమ్‌ప్రభు బంగారు బిస్కెట్స్‌తో కనిపిస్తున్నారు.

బంగారం వ్యాపారం వెనుక పనిచేసే వ్యక్తుల జీవితాలు, తెరవెనక ఎవరికీ తెలియని సంచలన విషయాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌, ఇంట్రెస్టింగ్‌ విజువల్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, యాక్షన్‌ ఘట్టాలు అబ్బురపరుస్తాయని మేకర్స్‌ తెలిపారు. అలగం పెరూమాళ్‌, జాఫర్‌ ఇడుక్కి జీఎం సుందర్‌, వసుంధర తదితరులు చిత్ర తారాగణం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events