Skip to main content

Namaste NRI

ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ప్రేమకథ

పొయెటిక్‌ మ్యూజికల్‌ లవ్‌స్టోరీగా రూపొందిన చిత్రం చకోర. శ్రవణ్‌, మలైకా టి వాసుపల్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి మంగా శ్రీనివాస్‌ దర్శకుడు. చింతాడ హేమారావు నిర్మాత. అక్టోబర్‌ 9న ప్రేక్షకుల ముందుకురానుంది. యువ హీరో ఆకాష్‌ జగన్నాథ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఇండస్ట్రీలోని వ్యక్తులతో పాటు కొందరు మీడియా మిత్రులకు ఈ సినిమా చూపించామని, అద్భుతమైన చిత్రమని ప్రశంసించారని దర్శకుడు మంగా శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఇప్పటివరకూ తెలుగు తెరపై రాని ప్రేమకథ ఇదని నిర్మాత అన్నారు. చక్కటి ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ కలబోసిన సినిమాగా ఆకట్టుకుంటుందని హీరో శ్రవణ్‌ అన్నారు. ఈ చిత్రానికి ప్రిన్స్‌ హెన్రీ మ్యూజిక్‌ అందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events