Skip to main content

Namaste NRI

ఆయనతో పనిచేస్తుంటే మాగురువు దాసరే గుర్తొచ్చారు : మోహన్‌బాబు

నాని హీరోగా శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మించిన పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామా ది ప్యారడైజ్‌. ఇటీవలే సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ములాఖాత్‌లో నటుడు డా.మోహన్‌బాబు మాట్లాడారు. నిర్మాత సుధాకర్‌ ఈ సినిమాకు ధైర్యంగా ఖర్చుపెట్టాడంటే కారణం డైరెక్టర్‌ శ్రీకాంత్‌పై ఉన్న నమ్మకమే. శ్రీకాంత్‌ ఈ కథను సులువుగా, అర్థమయ్యేలా ధైర్యంగా చెప్పాడు. సుదీర్ఘమైన నా కెరీర్‌లో 500లకు పైగా చిత్రాల్లో నటించాను. కానీ, సికంజమాలిక్‌ లాంటి భయంకరమైన పాత్రను పోషించడం మాత్రం ఇదే ప్రథమం. శ్రీకాంత్‌ నన్ను ఇంత భయంకరంగా చూపిస్తాడని అనుకోలేదు. నా లైఫ్‌లో ఎక్కువ టేకులు తీసుకున్న దర్శకుడు శ్రీకాంతే. ఆయనతో పనిచేస్తుంటే మాగురువు దాసరే గుర్తొచ్చారు. తను దేశంలోనే టాప్‌ డైరెక్టర్‌ అవుతాడు. ఈ సినిమా కోసం నాని పడ్డ కష్టం ఆ దేవుడికే తెలుసు. ప్రజలు ఆశీర్వదించారు. ప్యారడైజ్‌ సూపర్‌హిట్‌ అయింది అని అన్నారు.

ప్యారడైజ్‌ నాకు అన్ని విధాలా కొత్త అనుభూతినిచ్చింది. ప్రతి షోకీ పాజిటివిటీ పెరుగుతోంది. సినిమాలోని చిన్నచిన్న మూమెంట్స్‌ని కూడా ఆడియన్స్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. ముఖ్యంగా ప్రియదర్శి చేసిన శంకరన్న పాత్రకు ఎక్కడ చూసినా అద్భుతమైన స్పందన వస్తున్నది. ఈ సినిమాలో నాతో సహా అంతా ఎంత కష్టపడ్డారో దగ్గరుండి చూశాను. మోహన్‌బాబుగారు ఎంత గొప్ప వ్యక్తో కలిసి పనిచేశాక తెలిసింది. సాంకేతికంగా అంతా ప్రాణం పెట్టి పనిచేశారు. డైరెక్టర్‌ శ్రీకాంత్‌ ఒరిజినల్‌ పీస్‌. తన విషయంలో ప్రౌడ్‌గా ఫీలవుతున్నా అని నాని ఆనందం వెలిబుచ్చారు.

ప్రియదర్శి మాట్లాడుతూ శంకరన్న పాత్ర గురించి చెప్పగానే భయమేసింది. ధైర్యం కూడగట్టుకొని ఛాలెంజ్‌గా తీసుకుని చేశా. కోర్టు సినిమాలో సూర్యతేజ పాత్రకు ఎంత మంచి స్పందన వచ్చిందో, ఇందులో శంకరన్న పాత్రకి కూడా అంత మంచి రెస్పాన్స్‌ వచ్చింది. శంకరన్న పాత్రకు ఎంత గట్స్‌ ఉన్నాయో, ఈ సినిమా టీమ్‌కి కూడా అంత గట్స్‌ ఉన్నాయి. తెలుగు సినీసాహిత్యానికి దొరికిన కొత్త కాళేశ్వరం డ్యామ్‌ లాంటి వాడు మన రచయిత కాసర్ల శ్యామ్‌ అని పేర్కొన్నారు.

ప్రధాన పాత్రధారుల నుంచీ జూనియర్‌ ఆర్టిస్టుల వరకూ అంతా ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డారని, అనిరుద్‌, సాయి నవీన్‌ ఇలా అంతా బ్లడ్‌ పెట్టి పనిచేశారని, పోత్సహిస్తూ, ముందుకు నడిపిస్తున్న నాని, సుధాకర్‌ చెరుకూరిలకు కృతజ్ఞతలని, మోహన్‌బాబుతో పనిచేయడం జీవిత సాఫల్య పురస్కారంగా భావిస్తున్నానని దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events