మోహిత్ పెడాడ, శ్రీజిత ఘోష్ జంటగా నటిస్తున్న యువతరం ప్రేమకథ రిచ్. ఏ బస్తీ బాయ్ లవ్‌స్టోరీ అనేది ఉపశీర్షిక. రాజా నరేంద్ర దర్శకుడు. పద్మనాభరెడ్డి, మార్గం గోపీ నిర్మాతలు. హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. దర్శకులు దశరథ్, వి.సముద్ర, జి.రామ్‌ప్రసాద్, రచయిత గోపీమోహన్, ప్రముఖ నిర్మాత డిఎస్రావు, మిట్టపల్లి సురేందర్, ముక్కు అవినాష్ ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసి చిత్ర బృందానికి శుభాకాంక్షలు అందించారు.

వచ్చే నెలలో షూటింగ్ ప్రారంభించి, వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తామని నిర్మాతలు తెలిపారు. అన్ని ఎలిమెంట్స్ ఉన్న స్క్రిప్ట్ ఇదని, ఇంటర్వెల్, ైక్లెమాక్స్ గూస్బంప్స్ తెప్పిస్తాయని హీరో మోహిత్ చెప్పారు. నేటి తరానికి నచ్చే ఓ బస్తీ బాయ్ ప్రేమకథ ఇదని దర్శకుడు అన్నారు. ఇంకా కథానాయిక శ్రీజిత ఘోష్, నటి పూజా కేంద్రే, సహ నిర్మాత మహేంద్ర గైక్వాడ్ కూడా మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: సతీశ్‌రెడ్డి మాసం, సంగీతం: సాయికార్తీక్.















