Skip to main content

Namaste NRI

మేం సిద్ధంగా ఉన్నాం.. ట్రంప్ వ్యాఖ్య‌ల‌కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌!

ఇరాన్ శాంతి ప్ర‌ణాళిక‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ తిర‌స్క‌రించ‌డంతోపాటు బెదిరింపు ధోర‌ణిలో వ్యాఖ్య‌లు చేయ‌డంతో పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని అనిశ్చితి నెలకొన్న‌ది. ఈ క్ర‌మంలో ఇరాన్ కూడా స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చింది. అమెరికాతో తాము అంతిమ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామని ఇరాన్‌ విదేశాంగ మంత్రి అబ్బాస్‌ అరాగ్చీ ప్రకటించారు.

అమెరికాతో యుద్ధాన్ని తిరిగి ప్రారంభించేందుకు తాము పూర్తి సిద్ధంగా ఉన్నామ‌ని, ఒకవేళ అది అంతిమ యుద్ధానికి దారితీసినా తాము ఎదుర్కొంటామ‌ని అరాగ్చీ అన్నారు. అదే సమయంలో చర్చలకూ తాము సిద్ధమేన‌ని, ఏది జరగాలన్నది ట్రంప్ చేతిలోనే ఉందని అరాగ్చీ చెప్పారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events