Skip to main content

Namaste NRI

హెచ్‌-1 బీ మోసాలపై ఉక్కుపాదం

హెచ్‌-1 బీ వీసా కార్యక్రమంలో మోసాలపై ట్రంప్‌ సర్కార్‌ ఉక్కుపాదం మోపుతున్నది. విదేశీ కార్మికుల వీసాల్లో మోసం, ఉద్యోగుల దోపిడీ, మానవ అక్రమ రవాణా ఆరోపణలపై అమెరికా కార్మిక శాఖ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో హెచ్‌-1బీ వీసా కార్యక్రమం ఏడాది తర్వాత ప్రస్త్తుత రూపంలో ఉండకపోవచ్చని అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆంథోనీ డి ఎస్పొసిటో హెచ్చరించారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని సంకేతమిస్తూ మా దగ్గర చేతులకు బేడీలు సిద్ధంగా ఉన్నాయి అని ఆయన అన్నారు. విదేశీ కార్మికుల వీసా కార్యక్రమం 365 రోజలు తర్వాత ప్రస్తుతం ఉన్నదాని కంటే చాలా భిన్నంగా ఉండబోతోంది అని అన్నారు.

హెచ్‌-1 బీ వీసా కార్యక్రమంలో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఉన్న మోసాలు, ఉద్యోగుల దోపిడీ, మానవ అక్రమ రవాణాపై అమెరికా కార్మిక శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ కార్యాలయం దేశవ్యాప్తంగా దర్యాప్తు కొనసాగిస్తున్నది. ఈ నేపథ్యంలో టెక్‌ దిగ్గజ సంస్థలు కాగ్నిజంట్‌, క్లౌడెరాకు సంబంధించిన వీసా దరఖాస్తులను నేర దర్యాప్తు పూర్తయ్యే వరకు నిలిపివేసినట్లు కూడా తెలిపింది. విదేశీ కార్మికుల కార్యక్రమాలను దుర్వినియోగం చేశారనే అనుమానాలున్న సంస్థలు, విధానాలపై దర్యాప్తు కొనసాగుతున్నదని డి ఎస్పోసిటో తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events