Skip to main content

Namaste NRI

మయూఖ మూవీ ట్రైలర్‌ లాంచ్‌

పాయల్‌ చంగప్ప ప్రధాన పాత్ర పోషించిన చిత్రం మయూఖ. శ్రీతేజ్‌ ఎస్‌కే దర్శకత్వంలో శశిధర్‌ నల్ల నిర్మించిన ఈచిత్రం అక్టోబర్‌ 9న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. మయూఖ లాంటి సినిమాలు తెలుగులో అరుదుగా వస్తాయని, హాలీవుడ్‌, కొరియన్‌ సినిమాల స్థాయిలో సీజీ వర్క్‌ ఉంటుందని, సీట్‌ ఎడ్జ్‌ థ్రిల్లింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చే సినిమా ఇదని డైరెక్టర్‌ శ్రీతేజ్‌ ఎస్‌కే తెలిపారు.

ఈ సినిమా తర్వాత హీరోయిన్‌ పాయల్‌ చంగప్పను అంతా మయూఖ అనే పిలుస్తారని నిర్మాత శశిధర్‌ అన్నారు. ఈ సినిమాలో భాగం కావడం పట్ల పాయల్‌ చంగప్ప ఆనందం వెలిబుచ్చారు. ఇంకా ఇతర పాత్రధారులు, మాస్టర్‌ షణ్ముఖ్‌ చరణ్‌, బేబీ మది నస్రీన్‌, నానానీ కర్రీ, దేవ్‌డి, రఘు వాసిరెడ్డి, అభిలాష్‌ అడ్డ కూడా మాట్లాడారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events