Skip to main content

Namaste NRI

గీతాంజలి రీరిలీజ్‌ అప్పుడే

1989లో విడుదలైన చిత్రం గీతాంజలి. ఈ సినిమా అక్కినేని నాగార్జున సినీ జీవితానికే మేలి మలుపు. మణిరత్నం దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం, పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహణం ఈ సినిమాను ఇండియన్‌ క్లాసిక్‌గా నిలబెట్టాయి. ప్రస్తుతం రీరిలీజ్‌ల ట్రెండ్‌ నడుస్తున్న నేపథ్యంలో గీతాంజలి కూడా 4కే వెర్షన్‌లో నవంబర్‌ 13న తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రీరిలీజ్‌ కానున్నది.

హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో 37ఏండ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం నేటి యువతను సైతం తప్పకుండా ఆకట్టుకుంటుందని, 4కే వెర్షన్‌ తప్పకుండా కొత్త అనుభూతినిస్తుందని చిత్రాన్ని విడుదల చేస్తున్న బూర్లె శివప్రసాద్‌ తెలిపారు. శ్రీపద్మిని సినిమాస్‌ ద్వారా ఈ సినిమా విడుదల కానున్నది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events