Skip to main content

Namaste NRI

ఈ సినిమా ఎంతో ప్రత్యేకం : జెమినీ సురేశ్

వారాహి ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సోమేష్ నిర్మాతగా శ్రీనివాస్ బండ్రెడ్డి రచనా దర్శకత్వంలో రానున్న చిత్రం ఆత్మ కథ – యాన్ అన్ టోల్డ్ స్టోరీ. జెమిని సురేష్, రూప జంటగా నటించిన ఈ సినిమా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ్, మల యాళం, కన్నడ భాషలలో విడుదల కానుంది. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, రిథమ్ స్టూడియో ఇన్చార్జి కొల్లి రామకృష్ణ, కూనపరెడ్డి అవినాష్ చేతుల మీదగా హనుమాన్ మ్యూజిక్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఈ మ్యూజిక్ లేబుల్లో మొదటిగా ఈ సినిమా ఆడియోను సంగీత దర్శకులు ఆర్‌పి పట్నాయక్ రఘు కుంచె విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఎక్స్ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి మాట్లాడుతూ నా మిత్రుడు కూనపురెడ్డి అవినాష్ హనుమాన్ మ్యూజిక్ మొదలు పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రం మంచి విజయం సాధించాలి అని అన్నారు. జెమినీ సురేశ్ మాట్లాడుతూ పాటల విడుదల వేడుకలు జరిగి చాలా రోజులైంది. కథానాయకుడిగా కనిపించాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఈ సినిమా కథ ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది అన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events