Skip to main content

Namaste NRI

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన

మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో నేడు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, కే అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, రాంప్రసాద్ రెడ్డి, బీ సి జనార్ధన్ రెడ్డి,నిమ్మల రామానాయుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, రిలయెన్స్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ, పలువురు మంత్రులు, అధికారులు కూడా పాల్గొన్నారు.

నారా లోకేష్ మాట్లాడుతూ: హైదరాబాద్‌లో ఐఎస్ బి తరహా మ్యాజిక్ ఇప్పుడు రాయలసీమలో జరగబోతుంది. ఇక్కడకు రాబోయే గ్లోబల్ హార్టికల్చర్ హబ్ (GHH) – ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ISA) వ్యవసాయరంగ రూపురేఖలు మార్చబోతోందని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మదనపల్లెలో గ్లోబల్ హార్టికల్చర్ హబ్ – ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్‌ శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో కలసి మంత్రి లోకేష్ హాజరయ్యారు.

విత్తనం దగ్గర నుండి, ఉత్పాదకత, కోల్డ్ స్టోరేజ్, ప్యాకేజింగ్, యాంత్రీకరణ, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ వరకు ఇక్కడ రీసెర్చ్ జరుగుతుంది. ఇక్కడ పండించిన పండ్ల ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసినప్పుడే మన రైతులకు లాభం వస్తుంది. హార్టికల్చర్ హబ్ లక్ష్యం రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే. మనం కేవలం ఇతర రాష్ట్రాలకు కావాల్సిన వెరైటీలే కాకుండా ఇతర దేశాలకు అవసరమైన రకాల పంటలు కూడా పండించాలి. అందుకు అనుగుణంగా మామిడి, అరటి, టమాటా, దానిమ్మ, ఖర్జూరం, డ్రాగన్ ఫ్రూట్, పుచ్చకాయ, నిమ్మ, స్వీట్ ఆరెంజ్, అవకాడో, ఆపిల్, బెర్రీస్ వంటి ప్రతి వెరైటీకి సంబంధించి రీసెర్చ్ జరగాలని మంత్రి లోకేష్ ఆకాంక్షించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events