వెంకటేశ్‌కి జోడీగా శ్రీనిధి శెట్టి నటించిన సినిమా ఆదర్శకుంటుంబం. సినిమా ఈ నెల 9న విడుదల కానున్నది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను శ్రీనిధి వెల్లడించారు. సాఫ్ట్‌వేర్ జాబ్ చేసి, నటనపై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చాను. ఇష్టంతో ఓ రంగాన్ని ఎంచుకున్నప్పుడు కష్టమైనా భరిచాలి. సమస్యలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి అన్నారు. ఆదర్శకుటుంబం లో నేను పోషించిన తల్లి పాత్ర నా కెరీర్‌పై చెడు ప్రభావం చూపిస్తుందని చాలామంది అనుకుంటున్నారు. నేనైతే అలా అనుకోను. ఆదర్శకుటుంబం చూశాక ఆ పాత్ర నేనెందుకు ఒప్పుకున్నానో అందరికీ అర్థమవుతుంది. 15ఏండ్ల తర్వాత నేను నటించిన సినిమాలు చూసి, నేనే గర్వపడాలి అని చెప్పారు.

ఈ సినిమా పుణ్యమా అని వెంకటేశ్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. ఆయన్నే ప్రేరణగా తీసుకొని ఈ సినిమాలోని నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పాను. వెంకటేష్ లొకేషన్‌లో చాలా సరదాగా ఉంటారు. ఆయనతో పనిచేసే అవకాశం రావడం నిజంగా అదృష్టం అని ఆనందం వెలిబుచ్చారు శ్రీనిధిశెట్టి.















