అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న రాకా చిత్రంలో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలను ప్రముఖ నటి ఐశ్వర్య లక్ష్మి కొట్టిపారేశారు. ఈ చిత్రంలో ఆమె నటిస్తున్నట్లు కొద్ది రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతుండగా, ఆమె ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన క్యాస్టింగ్ గురించి వస్తున్న ఊహాగానాలు అవాస్తవమని స్పష్టం చేశారు. చిత్రంలో నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో ఆమె కనిపిస్తారంటూ వచ్చిన రూమర్లపై స్పందిస్తూ, లేదు, నేను ఈ చిత్రంలో భాగం కాదు. దయచేసి ఎవరైనా నన్ను ఈ సినిమాలో తీసుకోండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు.

అల్లు అర్జున్, అట్లీ కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘రాకా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తుండగా, మృణాల్ ఠాకూర్ జాన్వీ కపూర్, రష్మిక మందన్న తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నట్లు సమాచారం.















