Skip to main content

Namaste NRI

ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన… అమెరికాలో ప్రతి చిన్నారికి ఇస్తా!

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ వచ్చే ఏడాది అమెరికాలోని ప్రతి బిడ్డకు తన రాకెట్‌ తయారీ సంస్థ స్పేస్‌ఎక్స్‌లో ఒక వాటాను బహుమతిగా ఇవ్వనున్నారు. తన సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో ఈ విషయాన్ని మస్క్‌ ప్రకటించారు.

స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన ఒక షేర్‌ విలువ 146 డాలర్లు అంటే సుమారు రూ.14,000గా ఉంది. అమెరికాలో సుమారు 7.20 కోట్ల మంది పిల్లలు ఉన్నారు. తద్వారా పంపిణీ చేయాల్సిన వాటాల విలువ రూ. 1 లక్ష కోట్లు అవుతుంది. అయితే, దీనిని లక్షలాది మంది పిల్లలకు చేరవేసే ప్రక్రియ ఎలా ఉంటుందో తెలియదు. మస్క్‌ లేదా ఆయన కంపెనీ దీనిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం అందించలేదు. అంతేగాక ఏ పిల్లలు ఇందుకు అర్హులు అవుతారో కూడా స్పష్టంగా తెలియదు.

ఈ వాటాలు అమెరికా పౌరసత్వం కలిగిన పిల్లలకు మాత్రమే అందుబాటులో ఉంటాయా లేక అమెరికాలో నివసిస్తున్న ఇతర పిల్లలకు కూడా వర్తిస్తాయా అనేది స్పష్టంగా లేదు. మస్క్‌ ఎటువంటి వయోపరిమితిని పేర్కొనలేదు. తల్లిదండ్రులు తమ పిల్లల కోసం ఏయే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది, ఏదైనా ఫామ్‌ను పూరించాలా లేదా మరేదైనా పద్ధతిని అనుసరించాలా అనే వివరాలు ప్రస్తుతం తెలియవు.

అమెరికాలోని కోట్లాది మంది పిల్లలకు షేర్లను ఏ విధంగా బదిలీ చేస్తారు? మైనర్ల పేరిట ప్రత్యేక పెట్టుబడి ఖాతాలు ఏర్పాటు చేస్తారా? అందరికీ సమానంగా అందిస్తారా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. మరో ముఖ్యమైన ప్రశ్న షేర్లను పిల్లలకు ఎలా బదిలీ చేస్తారనేది తెలియదు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events