వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఆదర్శకుటుంబం హౌస్ నెంబర్ 47. అత్యంత వినోదాత్మకంగా, కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలతో కూడిన కథాంశంతో త్రివిక్రమ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు.

మ్యూజిక్ ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి రెండో పాటను మేకర్స్ విడుదల చేశారు. మాలా వచ్చా చూడు.. చాలా తెచ్చా పాలు.. నలగాలీ పూలూ ఒళ్లు.. అరవాలీ మంచం కోళ్లు అంటూ సాగే ఈ రొమాంటిక్ మాస్ గీతాన్ని వెంకటేశ్, నివేదా పేతురాజ్లపై చిత్రీకరించారు.

ఈ పాటలో వెంకీ, నివేదాల స్క్రీన్ ప్రెజన్స్, కెమిస్ట్రీ, ఉత్సహభరితమైన వారి అభినయం పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామజోగయ్యశాస్త్రి రాసిన ఈ పాటను తమన్ స్వరపరచగా, ధనుంజయ్ సీపాన, రణినారెడ్డి ఆలపించారు. భాను మాస్టర్ నృత్య రీతుల్ని సమకూర్చారు. త్వరలోనే ట్రైలర్ విడుదల కానున్నది. శ్రీనిధిశెట్టి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె.చంద్రన్.















