షారుక్‌ఖాన్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ కింగ్. దీపికా పదుకోన్ కథానాయిక. ఈ చిత్రంలో అనిల్‌కపూర్, అభిషేక్ బచ్చన్, రాణీ ముఖర్జీ, జాకీష్రాఫ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తూ గౌరీఖాన్, మమతా ఆనంద్‌లతో కలిసి నిర్మిస్తున్నారు.

ఈ సందర్భంగా మేకర్స్ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు. ఇంటెన్సిటీతోపాటు రొమాన్స్ టచ్ ఉన్న లుక్‌తో కనిపిస్తున్న షారుక్‌ఖాన్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. నిప్పులు చెరిగే కళ్లు, పెదాల మధ్య గులాబీ పువ్వు.. ఆయన పాత్ర స్వభావాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో షారుక్ ఎలా కనిపించబోతున్నారో ఈ పోస్టర్ చూస్తే అవగతమవుతున్నది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఈ పోస్టర్‌తో ఆ అంచనాలు రెట్టింపయ్యాయని మేకర్స్ అంటున్నారు. వయసు మీదపడ్డ హింసాత్మక హంతకుడిగా ఇందులో షారుక్‌ఖాన్ కనిపిస్తారని తెలిసింది. ఈ చిత్రం డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.















