అగ్ర కథానాయిక సాయిపల్లవి తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనుంది. సహజమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించే ఆమె ఖాకీ డ్రెస్‌లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నది. ధనుష్ కథానాయకుడిగా నటిస్తున్న ఓం సినిమాలో సాయిపల్లవి పోలీస్ అధికారి నిత్యారెడ్డి పాత్రను పోషిస్తున్నది. స్పెషల్ డ్యూటీ పేరుతో ఆమె ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు.

రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ డ్రామా నవంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాల్ని పెంచాయి. మమ్ముట్టి, సాయిపల్లవి, శ్రీలీల, నసీరుద్దీన్‌షా తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతాన్నందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకురానుంది.















