అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు అందిన 96 గంటల్లోనే ఇరాన్‌పై దాడులు చేసేందుకు పశ్చిమాసియాలో దళాలు సిద్ధంగా ఉన్నట్లు ఓ నివేదిక ద్వారా తెలిసింది. పశ్చిమాసియా ప్రాంతంలో సమృద్ధిగా తమ దళాలను మోహరించినట్లు ఇద్దరు అధికారులు తెలిపారు. ఇరానీ రేడార్లు, మిస్సైల్ లాంచర్లు మాత్రమే కాకుండా ఇతర మౌళిక సదుపాయాలను టార్గెట్ చేసేందుకు అమెరికా సంసిద్దమైనట్లు తెలుస్తోంది. దాడులు ఎప్పుడు చేయాలన్న నిర్ణయం ట్రంప్ చేతుల్లో ఉందని, ఆయన ఆదేశాలను అనుసరించి చర్యలు ఉంటాయని అమెరికా అధికారులు చెప్పారు.

అయితే ఈ ఏడాది చివరి లోగా ఎప్పుడైనా ఆ ఆదేశం రావొచ్చు అని అన్నారు. దాదాపు మధ్యంతర ఎన్నికలు ముగిసిన తర్వాత ఆ ఆదేశాలు అందే అవకాశాలు ఉన్నట్లు చెప్పారు. అయితే అమెరికా మిలిటరీ వ్యూహాలను ఇరానీ దళాలు సలువుగానే అర్థం చేసుకుంటున్నట్లు అమెరికా అధికారులు అంగీకరించారు.















