Skip to main content

Namaste NRI

దాడులు ఆపితే రూ.9,500 కోట్లు ఇస్తాం .. సౌదీ బంపర్‌ ఆఫర్‌

యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల దాడులతో ఉక్కిరిబిక్కిరవుతున్న సౌదీ అరేబియా వారితో ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. తమ దేశంపై దాడి చేయకుండా ఉండేందుకు హౌతీ రెబల్స్‌కు రూ.9,500 కోట్లను ఇవ్వడానికి సౌదీ సిద్ధమైనట్టు తెలిసింది. సౌదీ రక్షణ శాఖ మంత్రి ప్రిన్స్‌ ఖలీద్‌ బిన్‌ సల్మాన్‌ ఈ విషయమై చర్చలు జరపడానికి టెహ్రాన్‌కు చేరుకున్నారని తెలిపింది. మంత్రి వినియోగించిన హెర్క్యులెస్‌ మిలిటరీ విమానంలోనే ఈ సొమ్ము తీసుకువచ్చినట్టు పేర్కొంది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని రక్షణ మంత్రిత్వ శాఖ భవనంపై బాలిస్టిక్‌ క్షిపణితో నేరుగా దాడి చేసినట్టు హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. అయితే ఈ వాదనను నిర్ధారించే ఆధారాలు లేవు. మరోవైపు, హౌతీలు ప్రయోగించిన రెండు క్షిపణులను తమ గగనతల రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్టు సౌదీ అరేబియా ప్రకటించింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events