చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమెరికా అధ్యక్షుడి భవనమైన శ్వేతసౌధం(వైట్ హోస్)లో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశాధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను ఇండో అమెరికన్ ప్రముఖులు కొందరు కలిశారు. ఈ సందర్భంగా ఓవల్ ఆఫీసులో ట్రంప్ దీపం వెలిగించారు. ట్రంప్‌ను కలిసిన వారిలో మైక్రాన్ టెక్నాలజీ సీఈవో సంయ్ మెహ్రోత్రాతో పాటు అనేక మంది ఉన్నారు. అమెరికాలోని భారతీయ అంబాసిడర్‌వినయ్ మోహన్ ఖత్రా, సెలబ్రిటీ చెఫ్ వికాశ్ ఖన్నా, వ్యాపారవేత్త విశాల్ గోండల్, ఐబీఎం సీఈవో అరవింద కృష్ణ, ఎఫ్‌బీఐ కాశ్ పటేల్, అమెరికా ఆరోగ్య శాఖ డైరెక్టర్ జే భట్టాచార్య శ్వేతసౌధంలో జరిగిన దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు.

ఓవల్ ఆఫీసులో ట్రంప్ దీపం వెలిగించి పండుగ సంబరాలను ప్రారంభించారు. విదేశాంగ మంత్రి మార్కో రూబియో, డిప్యూటీ కమీషనర్ అర్జున్ మోడీ కూడా ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. డోనాల్డ్ ట్రంప్‌కు హనుమాన్ చాలీసా గిఫ్ట్‌గా ఇచ్చినట్లు పేర్కొన్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలపడాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.















