Skip to main content

Namaste NRI

మహాకాళి నుంచి అయిగిరి నందిని.. సాంగ్ రిలీజ్

శక్తికి ప్రతిరూపంగా, దుష్ట సంహారిణిగా భక్తులు కొలిచే మహాకాళి అమ్మవారి దివ్య స్వరూపాన్ని, ఉగ్రరూపంలోనూ అపారమైన కరుణను కురిపించే అమ్మవారి గుణాన్ని ఆవిష్కరిస్తూ మహాకాళి చిత్రబృందం అయిగిరి నందిని అనే పాటను విడుదల చేసింది. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌ నుంచి వస్తున్న ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భూమిశెట్టి, అక్షయ్‌ఖన్నా, శ్రియా రెడ్డి, రోహిత్‌ సారఫ్‌ కీలక పాత్రధారులు. ఆదిశంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ స్తోత్రం అయిగిరి నందిని ఆధారంగా రూపొందించిన ఈ పాట శక్తి భావం, శక్తివంతమైన సంగీతం, అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది.స్మరణ్‌సాయి స్వరపరచిన ఈ పాటను అనిలా రాజీవ్‌, గీతా మాధురి, సాయిచరణ్‌ ఆలపించారు.

మహాకాళి అమ్మవారి పాత్రలో శ్రియా రెడ్డి అభినయం హైలైట్‌గా నిలిచింది. ఓ వైపు ఉగ్రరూపం, మరోవైపు పసిబిడ్డను లాలిస్తూ మాతృరూపం ఈ రెండు కోణాలను ఆవిష్కరిస్తూ చూపించిన విజువల్స్‌ పాటకు ఆధ్యాత్మికత పరిపూర్ణతను తీసుకొచ్చాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్‌ రగుతు, షో రన్నర్‌: ప్రశాంత్‌వర్మ, దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events