శక్తికి ప్రతిరూపంగా, దుష్ట సంహారిణిగా భక్తులు కొలిచే మహాకాళి అమ్మవారి దివ్య స్వరూపాన్ని, ఉగ్రరూపంలోనూ అపారమైన కరుణను కురిపించే అమ్మవారి గుణాన్ని ఆవిష్కరిస్తూ మహాకాళి చిత్రబృందం అయిగిరి నందిని అనే పాటను విడుదల చేసింది. ప్రశాంత్‌వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న ఈ చిత్రానికి పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. భూమిశెట్టి, అక్షయ్ఖన్నా, శ్రియా రెడ్డి, రోహిత్ సారఫ్ కీలక పాత్రధారులు. ఆదిశంకరాచార్యులు రచించిన ప్రసిద్ధ స్తోత్రం అయిగిరి నందిని ఆధారంగా రూపొందించిన ఈ పాట శక్తి భావం, శక్తివంతమైన సంగీతం, అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకునేలా ఉంది.స్మరణ్‌సాయి స్వరపరచిన ఈ పాటను అనిలా రాజీవ్, గీతా మాధురి, సాయిచరణ్ ఆలపించారు.

మహాకాళి అమ్మవారి పాత్రలో శ్రియా రెడ్డి అభినయం హైలైట్‌గా నిలిచింది. ఓ వైపు ఉగ్రరూపం, మరోవైపు పసిబిడ్డను లాలిస్తూ మాతృరూపం ఈ రెండు కోణాలను ఆవిష్కరిస్తూ చూపించిన విజువల్స్ పాటకు ఆధ్యాత్మికత పరిపూర్ణతను తీసుకొచ్చాయి. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 8న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సురేష్ రగుతు, షో రన్నర్: ప్రశాంత్‌వర్మ, దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు.















