Skip to main content

Namaste NRI

కాలభైరవతో కావ్య కళ్యాణ్ రామ్ నిశ్చితార్థం

టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి కుటుంబంలో పెళ్లి సందడి మొదలైంది. ఆయన పెద్ద కుమారుడు, గాయకుడు, సంగీత దర్శకుడు కాలభైరవ త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రముఖ హీరోయిన్ కావ్య కళ్యాణ్‌రామ్‌తో ఆయన ఏడడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ జంట నిశ్చితార్థం కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా ఈ వేడుక జరిగినట్లు సమాచారం.

కాలభైరవ, కావ్య కళ్యాణ్‌రామ్‌ల నిశ్చితార్థ వేడుక నిరాడంబరంగా జరిగింది. ఈ వేడుకలో కాబోయే వధూవరులు సంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన భార్య రమా రాజమౌళితో పాటు కీరవాణి కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరైనట్లు తెలుస్తోంది. నూతన జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. చాలా ప్రైవేట్‌గా జరిగిన ఈ వేడుక ఫొటోలు బయటకు రావడంతో అభిమానులు, సినీ ప్రముఖులు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events