Skip to main content

Namaste NRI

టైసన్ నాయుడు నుంచి ఫస్ట్ సింగిల్.. మదరాసి రబ్బరు బొమ్మ విడుదల

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కథానాయకుడిగా, సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ టైసన్ నాయుడు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట అత్యంత భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరీష్ కట్టా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ మునుపెన్నడూ చూడని రీతిలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రఫ్ అండ్ టఫ్ మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, నేహా శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టైటిల్‌కు ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ రావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను గ్రాండ్‌గా ప్రారంభిస్తూ మొదటి పాట మదరాసి రబ్బరు బొమ్మ ను విడుదల చేశారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి ఫోక్ ఇన్స్‌పైర్డ్ కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతూ తమ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. విజయ్ పోలాకి అందించిన కొరియోగ్రఫీలో సాయి శ్రీనివాస్ తన ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో రచ్చ చేయగా, నేహా శెట్టి కూడా ఆయనకు సరిసమానంగా స్టెప్పులేసి ఆకట్టుకున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న కేమిస్ట్రీ ఈ పాటను విజువల్ ట్రీట్‌గా మార్చింది. గ్రాండ్ ప్రొడక్షన్ డిజైన్, కలర్‌ఫుల్ సెట్స్ పాటలో పండుగ వాతావరణాన్ని ప్రతిబింబించాయి. ముకేష్ జ్ఞానేష్ సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్, అవినాష్ కొల్లా మరియు కిరణ్ కుమార్ ఆర్ట్ డైరెక్షన్ ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలవనున్నాయి. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events