Skip to main content

Namaste NRI

హీరో సిద్ధు జొన్నలగడ్డ కొత్త సినిమా షురూ

హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న పదవ చిత్రం ప్రారంభమైంది. పొయెటిక్‌ లవ్‌స్టోరీగా తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా మోహన్‌.బి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. సుకుమార్‌ రైటింగ్స్‌, బన్నీవాస్‌ వర్క్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నయన్‌ సారిక కథానాయికగా నటిస్తున్నది. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర దర్శకుడు సుకుమార్‌ కెమెరా స్విఛాన్‌ చేయగా, అల్లు అరవింద్‌ క్లాప్‌కొట్టారు. ఈ సందర్భంగా విడుదల చేసిన థీమ్‌ పోస్టర్‌ సినిమా కథా ప్రపంచాన్ని ఆవిష్కరిస్తూ పొయెటిక్‌ ఫీల్‌తో ఆకట్టుకుంది.

సుకుమార్‌ బృందంలో కీలక సభ్యుడిగా ఉన్న దర్శకుడు మోహన్‌.బి ఈ సినిమా కోసం ఓ అందమైన, కవితాత్మక భావనలతో సాగే ప్రేమకథను సిద్ధం చేశారని, సిద్ధు జొన్నలగడ్డ పాత్ర చిత్రణ నవ్యరీతిలో ఉంటుందని మేకర్స్‌ తెలిపారు. షూటింగ్‌ త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రానికి కెమెరా: చంద్రు సెల్వరాజ్‌, సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌, నిర్మాతలు: అన్మోల్‌ శర్మ, బన్నీ వాసు, అశోక్‌ బండ్రెడ్డి, దర్శకత్వం: మోహన్‌.బి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events