Skip to main content

Namaste NRI

ప్రియుడితో ఏడడుగులు వేసిన ఇరుముడి హీరోయిన్

తెలుగు, తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితమైన హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ తన జీవితంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న తన ప్రియుడు రాజ్‌వెల్ రాజ్‌ను ఆమె వివాహం చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. కాలేజీ రోజుల నుంచి కొనసాగుతున్న వీరి ప్రేమ ప్రయాణం ఎట్టకేలకు పెళ్లి బంధంతో మరో మెట్టు ఎక్కింది. దీంతో ఈ జంటకు అభిమానులు, సినీ ప్రముఖుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

తమిళ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రియా భ‌వాని శంక‌ర్ , విభిన్నమైన కథలను ఎంచుకుంటూ నటిగా తన పరిధిని విస్తరించుకుంటున్నారు. ఇప్పటికే పలు విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన డిమోంటి కాలనీ సిరీస్‌లో ఆమె భాగమవడం విశేషం. ఈ ఫ్రాంచైజీలో భాగంగా రూపొందుతున్న డిమోంటి కాలనీ 3 చిత్రంలోనూ ప్రియా భవానీ శంకర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా 2027 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events